నాటు సారా త్రాగడం వల్ల ప్రాణాలకే ముప్పు..
1 min read– అటువంటి వారిపై చట్టమరమైన చర్యలు..
– గ్రామస్తులకు కౌన్సిలింగ్ ద్వారా నియంత్రణ చర్యలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు సబ్ సూపరింటెండెంట్ అరుణకుమారి ఆధ్వర్యంలో భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం శుక్రవారం హెడ్ కానిస్టేబుల్స్ సీతారాం మరియు సిబ్బంది కలిసి ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో దాడుల నిర్వహించగా నాటు సారాయి కాస్తున్న జంపల లక్ష్మి వైఫ్ ఆఫ్ దుర్గారావు ఆమెను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. మరియు మారకద్రవ్యాలు వాడటం వలన ప్రాణాలకు ము ప్పు కలిగే నష్టాలను గ్రామస్తులకు కౌన్సిలింగ్ ద్వారా వివరించడం జరిగిందని ఆయన అన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని. ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. నాటు సారాయి త్రాగడం వలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుటుంబ పరంగా అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోతున్నాయని కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. ఇకనైనా (నాటు సారా వద్దు ప్రాణమే ముద్దు) అ అనే ఒక నినాదంతో అందరు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని ఆయన అన్నారు. ఆరోగ్యంగా ఉండటానికి యువత విద్యతోపాటు క్రీడల వైపు మొగ్గు చూపాలని ఇటువంటి కార్యక్రమములు నిర్వహించే వారిని అరికట్టాలని లేదా మాకు తెలియజేయజెసి పోలీస్ వారికి సహకరించాలన్నరు. వారు వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.