బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
1 min read– అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ది..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. పగిడ్యాల మండలం లక్ష్మాపురం-1 సచివాలయ పరిధిలో గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అనిసీఎం జగన్ నిరూపించారన్నారు. మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో పాటూ వార్డు మెంబర్ల వరకు బీసీ కుటుంబం జన సముద్రంలా ఉందన్నారు. 82వేలమంది బీసీలు రాజకీయ సాధికారతతో పదవుల్లో ఉన్నారని.. బిసి ల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బిసి లు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ శ్రీమతి గంగిరెడ్డి రమాదేవి, వైసీపీ జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు సగినేల. వేంకట రమణ , పగిడ్యాల మండల కన్వీనర్ చిట్టిరెడ్డి , జయరామి రెడ్డి , లక్ష్మాపురం గ్రామ వైసిపి నాయకులు నంద్యాల నాగభూషణం గౌడ్ , వైసీపీ యువజన విభాగం నాయకులు జి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ప్రాతకోట వెంకటరెడ్డి, నెహ్రునగర్ విజయుడు, శ్రీనాధ రెడ్డి, దామెరాకుల జీవన్ సుందర్ రాజు, రామకృష్ణ, సుబాన్, వెంకటేశ్వర్లు, మల్యాల శంకరయ్య, మండల తహసిల్దార్ భారతి , మండల అభివృద్ధి అధికారి వెంకట రమణ , వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.