ఘనంగా రంజాన్ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో అవుకు రోడ్డు ఎస్ ఆర్ బిస్ ఈదుగాలో ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు శుక్రవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్లు ప్రకటించడంతోరంజాన్వేడు కలుఅట్టహాసంగాప్రారంభమయ్యాయఈ నేపథ్యంలోనే పట్టణాలలో పల్లెల్లో ప్రతి గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలోఅవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కు బయలుదేరడానికి ముందు ప్రతి ముస్లిం జకాత్ మరియుఫిత్రాలనువిధిగాచెల్లించి నమాజ్కుబయలుదేరుతారు. ఈద్గా దగ్గర నమాజు చదువుకోవాలని ముస్లిం పెద్దలు తెలపడం వలన శనివారం నాడు బనగానపల్లె పట్టణంలో ఉదయం 10 గంటలకు ఈద్గా దగ్గర నుండి అందరూ కలిసి అల్లహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇళ్ళలహు అంటూ తక్బీర్ చదువుతూ అందరూ బయలుదేరి అత్యంత భక్తిశ్రద్ధలతో ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ చదువుకొని అనంతరం ఇమామ్ రంజాన్ పండుగ ప్రత్యేకత రంజాన్ గొప్పతనం భయాన్ చేశారు. బయన్ అనంతరం పండుగ నమాజ్ ముగించుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగశుభాకాంక్షలు తెలుపుకున్నారు.మత సామరస్యానికిప్రతీకగారంజాన్పండుగనిలుస్తుండంతోమతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.