PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఈ పాస్​’ ఉంటేనే.. అనుమతి..!

1 min read

– రాష్ట్రాల రాకపోకలపై స్పష్టత
– కర్ణాటక బార్డర్​ చెక్​ పోస్టను తనిఖీ చేసిన ఎస్పీ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఈపాస్​ ఉంటేనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం.. ఏపీకి రావడానికి అనుమతి ఉంటుందని కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప స్పష్టం చేశారు. కరోన వైరస్​ నియంత్రణలో భాగంగా గురువారం అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెద్దహరివాణం చెక్​ పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెలాఖరి వరకు కర్ఫ్యూ ఉంటుందని, రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.

పొరుగురాష్ట్రాల నుంచి రావలన్నా… మన రాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. తప్పనిసరిగా ఈ పాస్​ ఉండాలన్నారు. ఎమర్జన్సీ వాహనాలకు ఎటువంటి పాస్ అవసరం లేదన్నారు. అనవసరంగా తిరిగే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజు వారిగా 3 వేల వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు. 150 వరకు కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గ్రామాలలో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అంతకు ముందు ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్​, భీమాస్​ సర్కిల్​ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ డా. ఫక్కీరప్ప పరిశీలించారు. ఎస్పీతోపాటు ఆదోని పట్టణ డిఎస్పీ వినోద్ కుమార్, ఆదోని సిఐ పార్ధసారధి, ఇస్వి ఎస్సై విజయలక్ష్మీ ఉన్నారు .

About Author