NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాం!

1 min read

– జగన్ లా మాయమాటలు చెప్పి మోసచేసేవాళ్లం కాదు
– యువనేత లోకేష్ తో న్యాయవాదుల భేటీ
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని నియోజకవర్గం కుప్పగల్లులో యువనేత లోకేష్ తో న్యాయవాదులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మేం జగన్ లా మాయమాటలు చెప్పి, మోసం చేసేవాళ్లం కాదు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హైకోర్టు వైజాగ్ లో అంటాడు, జగన్ రాయలసీమ లోనే హైకోర్టు అని మభ్య పెడుతున్నాడు.వైసిపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ లా కర్నూలులో ఒక మాట చెప్పి ఢిల్లీలో మరోమాట చెప్పే దుర్మార్గపు ఆలోచన నాకు లేదు. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతున్న జగన్ కర్నూలులో కనీసం స్థలం కేటాయించి, ఒక్క ఇటుక పెట్టాడా? జగన్ చెప్పే అబద్దాలు తియ్యగా, మేం చెప్పే నిజాలు చేదుగా ఉంటాయి. విజ్ఞులైన న్యాయవాదులు నిజానిజాలను గుర్తించాలి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకుంది… అధికారంలోకి వచ్చాక ఏర్పాటుచేస్తాం. పరిపాలన అంతా ఒక చోట ఉండాలి, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. న్యాయ విభాగానికి సరైన నిధులు, మౌలిక వసతులు కల్పించకుండా కేసులు పెండింగ్ లో ఉన్నాయని నిందించడం సబబు కాదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు ఎక్కువగా కేటాయించి, మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. మీ వల్లే రాష్ట్రంలో జగన్ చేసిన అరాచకాలను కొంత వరకైనా అడ్డుకోగలిగాం. జూనియర్ లాయర్లకి స్టయిఫండ్ ఇస్తాం. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామని యువనేత లోకేష్ చెప్పారు.

About Author