NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకే- చలివేంద్రాలు

1 min read

– అమరావతి మైత్రి సమితి గౌరవ అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు , వడగాల్పులు నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు మండలాల పరిధిలో అలాగే గ్రామాలలోని రహదారుల ప్రక్కన చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల అలాగే బాటసారుల దాహార్తి తీర్చడం మహా పుణ్య మని అమరావతి మైత్రి సమితి గౌరవ అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ అన్నారు, సందర్భంగా ఆయన ఆదివారం ఉదయం మండలంలోని రామన పల్లె బీసీ కాలనీ కూడలి వద్ద అమరావతి మైత్రి సమితి అధ్యక్షులు పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్, బిసి యూత్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల కూడల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, అటు ప్రజలకు, ఇటు బాటసారూలకు అదేవిధంగా ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు, జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ వేడిని బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అందరూ పాటించాలని ఆయన తెలియజేశారు, అదేవిధంగా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, అసోసియేషన్ వారు ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి నీటితోపాటు, మజ్జిగ, అలాగే, పానకం ఏర్పాటుచేసిన అమరావతి మైత్రి సమితి అధ్యక్షులు పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ ను ఆయన అభినందించారు , ఈ కార్యక్రమంలో అమరావతి మైత్రి సభ్యులు శంకరయ్య బ్రహ్మయ్య, రవి, గంగాధర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

About Author