PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మరక్షణలో.. ప్రభుత్వం..!

1 min read

ఉద్యమం నీరుగార్చేందుకు విశ్వప్రయత్నం..!

రెవిన్యూ జేఏసీ అధ్యక్షుడంటూ దివాకర్​..దిగజారుడు మాటలు..

ప్రజల దృష్టిలో ఉద్యోగులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం…

ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్​ గిరికుమార్​ రెడ్డి ఘాటు ప్రశ్న

పల్లెవెలుగు వెబ్​: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమం నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.. ఉద్యమం తీవ్రరూపం దాల్చిన తరుణంలో ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించి.. అణగదొక్కేందుకు యత్నించడం ఎంత వరకు సమంజసమని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.  సోమవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీజేఏసీ అమరావతి చైర్మన్​ బొప్పరాజు నేతృత్వంలో  గత మార్చి 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.  ఆదివారం ఓ పత్రికలో.. రెవెన్యూ జేఏసీ అధ్యక్షుడు అంటూ దివాకర్​  ప్రెస్​మీట్​ పెట్టి .. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల గురించి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మార్చి 9 నుంచి ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యమం చేస్తుంటే… ఇన్ని రోజులు నిద్రపోయారా…. దివాకర్​ గారు…అని వ్యంగ్యంగా మాట్లాడారు. దివాకర్​  మాటలను APJAC అమరావతి మరియు APRSA కర్నూల్ జిల్లా పక్షాన తీవ్రముగా ఖండిస్తున్నాము. 

ఆత్మ రక్షణలో.. ప్రభుత్వం..!

రోజురోజుకు ఉద్యమం తీవ్రం కావడంతో… రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి బదులు… తమను ప్రజల వద్ద దోషులుగా నిలబెట్టేందుకు యత్నించడం దారుణమన్నారు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో మేలు చేసిందని, డిమాండ్లన్నీ నెరవేర్చిందని తప్పుడు స్టేట్​మెంట్​ ఇచ్చిన దివాకర్​ గారు… వీటికి సమాధానం చెప్పండని ప్రశ్నల వర్షం కురిపించారు.

1.ఉద్యోగులకు ఇప్పటిదాకా ఎన్ని DA లు పెండింగులో వున్నాయి ?

2. ఉద్యోగులకు రావలసిన PRC  బకాయిల మొత్తం ఎంత ?,

3. ఉద్యోగుల GPF  ఖాతాల నుండి మాయమైపోయిన డబ్బు ఎంత ? దాని  జాడ ఏది?

4. EHS సబ్ స్క్రిప్షన్ డబ్బులు ఏ కాకులు ఎక్కడి ఎత్తుకెళ్ళాయి?

5. సరెండర్ లీవు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్న డబ్బులు ఎంత దూరములో వున్నాయి ?

6. సాక్షాత్తూ  ముఖ్యమంత్రి గారు ఇచ్చిన CPS  హామీ రద్దు గడువు వారం రోజులు పూర్తి కాలేదా ?

7. శ్రమదోపిడీకి గురవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏ మూలన పడిపోయింది ?

8. సమగ్ర శిక్షలో దాదాపు 25 వేల మంది ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు అన్ధసలేదన్న విషయం వాస్తవం కాదా ?

9. చాలీ చాలని జీతాలతో బతకలేక అప్పులపాలవుతున్న అవుట్ సోర్చింగ్ ఉద్యోగుల జీతాల పెంపు ఇక ముంపేనా ?

దయ చేసి నిజాయితీగా రోడ్డెక్కిన ఉద్యోగులను చులకనగా చూస్తూ ఇలాంటి కనీస cadre లేని నాయకులతో  స్టేట్మెంట్లు ఇప్పించడం దారుణమన్న ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లాచైర్మన్​ గిరికుమార్​ రెడ్డి… అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతరం అవుతుందని ఘాటుగా హెచ్చరించారు.

About Author