పేదల సేవలో విశ్వభారతి ఆసుపత్రి – వైద్య శిబిరానికి విశేష స్పందన
1 min read-ప్రజలకు అనుకోని రీతిగా ఏర్పాట్లు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో ఆదివారం కర్నూలు విశ్వ భారతి వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కాంతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరం అనుకోని రీతిగా విశేష స్పందన లభించింది.ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈవైద్య శిబిరం జరగగా ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు.చుట్టుప్రక్కల గ్రామాలు అయిన కడుమూరు,ఉప్పలదడియ,దిగువపాడు, 49బన్నూరు,చౌటుకూరు,పైపాలెం నుంచి మొత్తం 350 మంది ప్రజలు వచ్చి ఆరోగ్య చికిత్సలు చేయించుకున్నారని ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు.వీరందరికీ ఆసుపత్రి అధినేత డాక్టర్ కాంతారెడ్డి వారి కుమారుడు డాక్టర్ నికేతన్ రెడ్డి మరియు అక్కడ పనిచేసే వైద్యులు,సిబ్బందితో రోగులకు చికిత్సలు చేశారు.అనంతరం రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు.కీళ్లు మోకాళ్ల నొప్పులు,బిపి షుగర్,గుండె జబ్బులు చెవి ముక్కు గొంతు,చిన్నపిల్లల వ్యాధులు,మానసిక వ్యాధులు, గర్భాశయ,ఆర్థోపెడిక్ ఈసీజీ తదితర చికిత్సలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు.ఈవైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ కూడా మంచి భోజనాలను చేయించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ వాహనాల ద్వారా సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అంతేకాకుండా మారుమూల ప్రాంతాల పేద ప్రజల కోసం ఉచితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అంటూ వివిధ గ్రామాల ప్రజలు అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు,గ్రామ పెద్దలు డి.నాగేశ్వర రెడ్డి,ఎం.రామకృష్ణారెడ్డి, రామలింగేశ్వర రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి,ఉపసర్పంచ్ మర్రి రామకృష్ణ,వెంకటేశ్వర్లు,మర్రి రామేశ్వరుడు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.