కోళ్లబాపురం ఉపాధి’లో అంతులేని అవినీతి..
1 min read– ఫిల్డ్ అసిస్టెంట్ పై అవినీతి ఆరోపణలు..
– జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం.
– అధికారులే ఫిల్డ్ అసిస్టెంట్ కు కొమ్ము కాస్తున్నారా.?
– ఫీల్డ్ అసిస్టెంట్ పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
– ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి .
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదలకు ఉపాధి పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఉపాధి వనరుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేట్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, రిటైడ్ అధికారులు ,రెవిన్యూ శాఖ అధికారుల కుటుంబ సభ్యుల పేర్లతో హాజరు వేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సోషల్ అడిట్ లో అవినీతి బయట పడకుండా తూతుమంత్రంగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిల్డ్ అసిస్టెంట్ అవినీతి గురించి గ్రామ సర్పంచి జిల్లా స్థాయి అధికారులకే కాదు రాష్ట్ర స్థాయి అధికారులకు సాక్షాలతో కూడిన ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నందికొట్కూరు మండలం కోళ్ళబావాపురం కి చెందిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్భారతి చేసిన అక్రమాలు, అన్యాయాలు గురించి 2023 జనవరిలో ‘స్పందన’ కార్యక్రమములో సర్పంచు కృష్ణవేణి ఫిర్యాదు చేశారు.ఉపాధి లో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు ఇలా ఉన్నాయి.
అవినీతి చిట్టా..
దాసన్న గారి కుష్పలత ( జాబ్ కార్డు .. 8030274) ‘విజ్డమ్ ప్రవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేయుచున్నారు.తోకల సావిత్రి ( : 8030346) నందికొట్కూరు శ్లోక స్కూలు” లో పని చేస్తున్నారు. సుభద్రమ్మ ( 80 3011 3) ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తున్నారు. శివ కుమార్ ( 8030159) ఏపీ స్పెషల్ పోలీసు విభాగంలో పోలీసు గా తిరుపతి లో పని చేయనున్నారు .వరలక్ష్మి ( 8030261) ఆశా వర్కరు” గా పని చేయిచున్నారు.సంగిరెడ్డి రాయుడు ( 8030114) హంద్రీనీవా ప్రాజెక్టు ఆఫీసు నందు పనిచేయనున్నారు. మురళి ( 8030013) : పని రాకపోయినా హాజరు వేశారు. కూలీ వేయడం చెగినది.కవిత ( 8030137) భర్త రెవెన్యూ శాఖలో నందు పని ప్రభుత్వ ఉద్యోగి. పార్ధ సారధి ( 8030012) ఫారెస్టు డిపార్టుమెంటులో ఉద్యోగం. రామాజనేయులు ( 8030045) కర్నూలులో ప్రైవేటు కాలేజి నందు లెక్చరర్ గా పని చేయచన్నాడు. మధు ( కి030105) “సహారా అగి, ప్రాజెక్టు నందు పని చేయు చున్నాడు.రవి ( 80300) తిప్పాయపల్లి సోలార్ పవర్ ప్లాంటు నందు పనిచేయుచున్నాడు.సగినేల ధర్మరాజు ( 8030148) శంషాబాద్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నారు.
సతీష్ ( 8030115) విశ్వభారతి హాస్పిటల్, క్నూలు నందు ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేయుచున్నాడు. సురేష్ బాబు ( 8030161) రెవిన్యూ శాఖలో ఉద్యోగం. రాముడు ( 8030260) ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగి. ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతున్నాడు. మధుసూధన్ ( 8030275) టయోటో షోరూం నందు పని చేస్తున్నారు. వీరందరూ ఉపాధి హామీ పనులకు రాలేదని వీరి పేరుతో కూలీ డబ్బులు ఫిల్డ్ అసిస్టెంట్ స్వాహా చేశారని సర్పంచు కృష్ణవేణి జిల్లా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
అవినీతిని ప్రశ్నిస్తే సర్పంచు పైనే దాడులా..
పీల్డ్ అసిస్టెంట్ అవినీతి బాగోతం బట్టబయలు అయినప్పటికీ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సర్పంచు కృష్ణవేణి ప్రశ్నిస్తున్నారు. అవినీతిని ప్రశ్నించిన గ్రామ సర్పంచు పైన గ్రామ సభలో ఉపాధి హామీ నందికొట్కూరు క్లస్టర్ అధికారులు ,స్థానిక మండల ప్రజా పరిషత్ అధికారుల సమక్షంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ దాడి చేసిన సంఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన గురుంచి అప్పట్లో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.అవినీతి అక్రమాలు గురించి గ్రామంలో విచారణ చేపట్టిన ఉపాధి అధికారులు ఏపీడీ ,ఏపీఓలు రహస్యంగా విచారణ ఎలా జరుపుతారని ప్రశ్నించారు. ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ఉపాధి హామీ జాబ్ కార్డులా..?
ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి..
కోళ్లబావాపురం గ్రామంలో ఆయా శాఖలలో పని చేసే ఉద్యోగులకు ఉపాధి పని చేసినట్లు మస్టర్ ఎలా వేస్తారని ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి ప్రశ్నిం చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధి జాబ్ కార్డులను ఎలా ఇస్తారన్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కోళ్లబావాపురం గ్రామానికి చెందిన ఆయా శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు మస్టర్లు వేయడం దారుణమన్నారు. అక్రమాలకు పాల్పడిన చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ భారతిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విచారణ జరిపి నివేదికలు ఉన్నతాధికారులకు పంపించాము.
ఎంపీడీఓ శోభారాణి..నందికొట్కూరు.
కోళ్ల బాపురం గ్రామంలో జరిగిన ఉపాధిహామీ పథకం పనులలో జరిగిన అవినీతిఅక్రమాలపై గ్రామంలో విచారణ చేశామన్నారు.సోషల్ ఆడిట్ లో ఎలాంటి అక్రమాలు ,అవినీతి జరగలేదని తేల్చిచెప్పారన్నారు.సామాజిక తనిఖీలో అలాగే మా విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలను పంపడం జరిగిందని ఎంపీడీఓ శోభారాణి తెలియజేశారు.