PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల సమక్షంలోనే తనిఖీ నిర్వహించాలి

1 min read

– మండల విద్యాశాఖ అధికారి స్టెల్లా షర్మిల రాణి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో నే ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాల్సి ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి స్టెల్లా షర్మిల రాణి అన్నారు, సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశా లలో పాఠశాల సామాజిక తనిఖీల కు సంబంధించి సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్ పి సురేష్, కోర్స్ కోఆర్డినేటర్ గా మండల విద్యాధికారి స్టెల్లా షర్మిల రాణి వ్యవహరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలల్లో రెండు విధాలుగా సామాజిక తనిఖీ నిర్వహించాలని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ ఇన్ఫర్మేషన్ పూర్తి చేయవలసి ఉంటుందని, అలాగే 6 డొమైన్స్ జనవరి 2021 నాటి ఇన్ఫర్మేషన్ పూర్తి చేయవలసి ఉంటుందని ఆమె సూచించారు, అదేవిధంగా ఈ6 డొమైన్స్ నందు 42 సబ్ డమైన్స్ లో 1749 క్యూస్షన్స్ ఉంటాయని ఆమె తెలిపారు, అదేవిధంగా ప్రతి డొమైన్ గురించి వివరంగా తెలియజేయడం జరిగిందని, క్యూస్షన్స్ పూర్తి చేయు విధానం గురించి కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగిందని ఆమె అన్నారు, ఈ సందర్భంగా యాప్ అప్లోడ్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షణ అసిస్టెంట్ దశరథ రామీ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author