ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం లో కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల – ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం దంత మొబైల్ వాహనం ( డెంటల్) ద్వారా దాదాపు 200 మందికి పైగా పేషంట్లకు దంత పరీక్షలు నిర్వహించడం జరిగిందని దంత వైద్యులు డాక్టర్ డి సురేష్ అన్నారు, ఈ సందర్భంగా రిమ్స్ ప్రభుత్వ దంత వైద్యులు మాట్లాడుతూ, వెల్ స్కోప్ అనే పరికరం ద్వారా నోటి క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించవచ్చని తెలిపారు, అదేవిధంగా ఈ క్యాన్సర్ కి సంబంధించి నివారణ చర్యలు కూడా చేపట్టవచ్చని వారు తెలియజేశారు, దంత పరీక్షలు నిర్వహించుకోవడానికి వచ్చిన పేషంట్లకు దంత కళాశాల మొబైల్ వాహనంలోనే అన్ని పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, అలాగే పేస్టులు, బ్రష్ లు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు, అంతేకాకుండా పంటికి సంబంధించిన ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే కడప రిమ్స్ డెంటల్ ఆస్పత్రికి రావాల్సిందిగా వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ కే నారాయణ రెడ్డి, పీజీ డాక్టర్ రమాదేవి, డాక్టర్ స్రవంతి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సుప్రియ, డాక్టర్ రమ్య లు పాల్గొన్నారు.