ప్రపంచ మలేరియా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నుండి బస్టాండు, అలాగే చెన్నూరు పురవీధులలో డాక్టర్ చెన్నరెడ్డి డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మలేరియా పై ర్యాలీ నిర్వహించడం జరిగింది , ఈ సందర్భంగా డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మలేరియా మహా డేంజర్ అని ప్రజలు దీనిపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు మలేరియా పై నిర్మూలన ప్రజలు ముందు జాగ్రత్తలు వజిస్తే దానిని నిర్మూలించవచ్చని వారు తెలియజేశారు , మలేరియా ఇదొక ప్రాణాంతక జ్వరము ఆడ అనాఫలిస్ దోమకాటుతో ఈ జ్వరం సోకుతుందని వారు తెలిపారు, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మలేరియా జ్వరము దరిచేరదన్నారు, అలాగే రాత్రిపూట దోమతెరలు వాడటం, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడము ,దోమలను పుట్టకుండా చేయడం వలన దోమలు కుట్టకుండా చేయవచ్చునని వారు తెలియజేశారు, మలేరియా వచ్చినప్పుడు లక్షణాలు చలితో వణుకుతో విపరీతమైన జ్వరం వస్తుందని, తలనొప్పి ,ఒళ్ళు నొప్పులు ఉంటాయన్నారు రోజు మార్చి రోజు జ్వరం రావడము, వాంతులు రావడం జరుగుతుందని ప్రజలకు ఈ లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తపరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ తెలుసుకోవచ్చు అన్నారు, పై సూచనలు సలహాలు పాటిస్తే ఈ వ్యాధి నుండి రక్షణ పొందుతారని వారు ప్రజలకు అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ బాల కేశమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మీదేవి, హెచ్ ఎస్ ఎం సుబ్రహ్మణ్యం, హెచ్ ఎస్ ఎఫ్ లక్ష్మి కుమారి ,సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.