ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండలం, అల్వాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ భగవద్రామానుజా చార్యులు వేయి సంవత్సరాలకు మునుపే సమాజానికి బాటలు వేసిన కారణజన్ముడని, ప్రపంచానికి జగద్గురువులు శ్రీకృష్ణుని తర్వాత ఆదిశంకరూలేనని ఆన్నారు. ఈ దేశ అఖండత్వంకోసం ఆసేతు సీతాచలం పర్యటించి భక్తి మార్గాన్ని సుసంపన్నం చేసిన గొప్ప ధీశాలి అని కొనియాడారు. ఇదే తత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు గ్రామ గ్రామాన ధార్మిక చింతన పెంచి, సమాజంలో సమతా మమతా భావన పెంచే ఉద్దేశంతో శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై మూడు రోజులపాటు మద్దయ్య స్వామిచే ప్రవచనాలు, ప్రతిరోజు స్థానిక భజన మండలిచే భజనలు, ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొదటి రోజు శ్రీమద్రామాయణంపై మద్దయ్య స్వామి ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ ప్రముఖ్ డమాం జగదీశ్, ఎంపిటిసి ఆర్. వెంకట్రామిరెడ్డి, భజన మండలి అధ్యక్షులు మురహరిరెడ్డి, పంచాంగ కర్త బి.శ్రీనివాసులు, కె.నారాయణరెడ్డి కె. కర్రెన్న, గ్రామపెద్దలు శ్రీనివాసులురెడ్డి, యు.రామిరెడ్డి, కె.మహేశ్వర రెడ్డి, వి.కృష్ణయ్యాచారి, కె.అశోక్, కె.మల్లిఖార్జున, అర్చకులు యు.సోమన్న తదితరులు పాల్గొన్నారు.