పొలాలు చూపించాలని దళితులు రిలే నిరాహార దీక్ష
1 min read-దళితులకు మద్దతుగా ఉంటాం -రైతులకు భూములు ఇచ్చే వరకు పోరాటం ఆగదు:సిపిఎం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పట్టాలు ఇచ్చిన దళితులకు భూములు చూపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మిడుతూరు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా రమేష్ కుమార్ వ్యకాస జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ మిడుతూరు మండల కేంద్రంలో దళితులు,బీసీలకు 1996లో అలగనూరు పొలిమేర లో సర్వేనెంబర్ 26/2 48 376 తదితర నెంబర్లో పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు.సొసైటీలో పంట రుణాలు తెచ్చుకోవడం జరిగిందని 27 సంవత్సరాల అవుతున్న భూములు చూపకపోవడం విచారకరమన్నారు.పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిన దళితులకు భూములు చూపించాలని జిల్లా కలెక్టరు,శాసనసభ్యులు మరియు ఆర్టీవో కు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని గతంలో నిరాహార దీక్ష చేసిన సందర్భంగా తహ సిల్దార్ 15 రోజుల్లో భూములు చూపిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేయడం విచారకరమన్నారు.భూములు చూపేవరకు ఆందోళన కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.రైతులకు భూములు చూపేవరకు రోజుకొక కార్యక్రమం ద్వారా తహసిల్దార్ ముట్టడి మరియు రోడ్డు దిగ్బంధం ఇలా చేయటం జరుగుతూ ఉందని అధికారులు సక్రమంగా పని చేయకపోవడం వల్లే పరిస్థితి ఇలా వచ్చిందని పొలాలు చూపే వరకు దళితులకు అండగా ఉంటూ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో సిఐటియు వ్యకాస జిల్లా నాయకులు కే.భాస్కర్ రెడ్డి,పి.బక్రీద్,మండల నాయకులు టి.ఓబులేష్,లింగస్వామి, వెంకటశివుడు,రామిరెడ్డి, బాలకృష్ణ,రామకృష్ణ,సుజ్ఞానం, జయరాముడు,ఏసన్న, లింగమ్మ శివ లక్ష్మమ్మ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.