తాలూకా కేంద్రాలలో నిరసన కార్యక్రమం విజయవంతంచేయండి –ఫ్యాప్టో
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ర్ట విద్యా శాఖలో అత్యున్నత అధికారి ప్రవీణ్ ప్రకాశ్ స్వయంగా పాఠశాలల తనిఖీ పేరుతో గడప గడపకు వెళ్లి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరిస్తూ అధికారులను మరియు టీచర్లను సస్పెండ్ చేయటం రాష్ర్ట ఫ్యాప్టో పిలుపు మేరకు 26 వతేది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో SSC స్పాట్ కేంద్రం వద్ద మరియు తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేయుట కొరకు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు యస్. గోకారి గారి అధ్యక్షతన జరిగింది.పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వైఖరికి నిరసనగా అన్ని తాలూకా కేంద్రాలలో మరియు స్పాట్ కేంద్రము వద్ద నిరసన ప్రదర్శన కార్యక్రమమును విజయవంతం చేయవలెనని కోరారు.ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా రాష్ర్ట కో ఛైర్మన్ కె ప్రకాష్ రావు, సెక్రెటరీ జనరల్ జి.తిమ్మప్ప,కోశాధికారి సెవాలాల్ నాయక్ ,జిల్లా FAPTO కార్యదర్శులు,జయరాజు,ఇస్మాయిల్,రంగన్న,జనార్థన్ లు హాజరు కావడం జరిగింది.