PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరులో ఘనంగా జాతీయ పంచాయితీ దినోత్సవం..

1 min read

– సుస్ధిర అభివృద్ధి లక్ష్యసాధనలో 12 పంచాయతీలకు జిల్లాస్ధాయి అవార్డులు..
– సూరప్పగూడెం.పంచాయితీకి రాష్ట్రస్ధాయి అవార్డు…కలకుర్రు కు జిల్లా స్థాయిలో రెండవ స్థానం..
– పలువురు సర్పంచులను, కార్యదర్శులను సన్మానించిన
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గ్రామాల్లో సుపరిపాలన అందిస్తూ సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో గ్రామ సర్పంచ్ లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మమేకం కావాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం -2023 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ఎస్ మూర్తి, జెడ్పి సిఇఓ రవికుమార్, డిపివో జివికె మల్లిఖార్జునరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో సుస్ధిర అభివృద్ధికి కృషిచేసిన 12 మంది గ్రామ సర్పంచ్ లను సత్కరించారు. అదే విధంగా భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ పంచాయతీగా ఎంపిక అయింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాల్లో సుస్ధిర అభివృద్ధికి సర్పంచ్ ల సేవలే ప్రామాణికమన్నారు. భారతదేశంలో గ్రామ, మండల, జెడ్పి స్ధాయిలో మూడంచెల పరిపాలనను 1992 లో 73వ రాజ్యాంగ సవరణద్వారా తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామ స్ధాయిలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, క్షేత్రస్ధాయిలో అమలు కావాలన్నదే దీనిలక్ష్యమన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగిందని అయితే ఇది పూర్తిస్ధాయిలో వినియోగించుకోవడంలో మహిళలు ముఖ్యపాత్ర వహించాలన్నారు. గ్రామాల సుస్ధిర అభివృద్ధి సాధనలో భాగంగా భారతదేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమన్నారు. సచివాలయ సిబ్బంది సమర్ధవంతంగా పనిచేసి నవరత్నాలు అందరికి అందేలా, వాటి గురించి క్షేత్రస్ధాయిలో పూర్తి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రత, శానిటేషన్, త్రాగునీటి సరఫరా విషయంలో ఇతర జిల్లాల కన్నా మన జిల్లాలో బాగానే జరుగుతుందన్నారు. జిల్లాలో 20 గ్రామాలను ఎంపిక చేసి సంపూర్ణపారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని ఇది జిల్లాస్ధాయిలో కూడా అమలు కానుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అయా గ్రామాల్లో సాధించిన ప్రగతికి ఆగష్టు 15వ తేదీన వారిని సత్కరించడం జరుగుతుందన్నారు. ఇటీవల ఉపాధిహామీ, గ్రామ పరిశుభ్రత తదితర అంశాల్లో బుట్టాయిగూడెం గ్రామ సర్పంచ్ జాతీయ స్ధాయిలో అవార్డు పొందడం అభినందనీయమన్నారు. కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని సమిష్టికృషితో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలన్నారు. దేశాభివృధ్దికి పల్లెసీమలే పట్టుకొమ్మలు అని చెప్పిన మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వాధికారులు అడుగులు వేస్తున్నారన్నారు. దేశంలోనే వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్ధను ఏర్పాటు చేసి గ్రామా స్వరాజ్యపాలనను నెలకొల్పడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. జిల్లా పంచాయితీ అధికారి జివికె మల్లిఖార్జునరావు మాట్లాడుతూ జాతీయ పంచాయతీ రాజ్ దినో త్సవం సందర్భంగా తొమ్మిది అంశాలను పరిశీలించి ఈ అవార్డులు ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లాకు సంబంధించి భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయితీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిందన్నారు. స్వయం సమృద్ధి , మౌలిక సదుపాయాలు కల్పనలో ప్రగతి సాధించినందుకు ఇటు జిల్లా , అటు రాష్ట్రస్థాయిల్లో సూరప్పగూడెం పంచా యతీకి అవార్డులు లభించింది. ఇక జిల్లాలో 12 పంచాయ తీలకు జిల్లా స్థాయి అవార్డులు లభించాయి. గ్రామ పంచాయతీల్లో పేదరికం లేని మెరుగైన జీవనోపాధి , ఆరోగ్యకరమైన పంచాయతీ , చైల్డ్ ఫ్రెండ్లీ , తగినంత నీరు క్లీన్ అండ్ గ్రీన్ , స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు , సామాజికంగా సురక్షితం , పంచా యతీ విత్ గుడ్ గవర్నెన్స్ , ఉమెన్ ఫ్రెండ్లీ అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఆయా పంచాయతీలకు మార్కు లు వేసి ఉత్తమ పంచాయతీలుగా ప్రకటించడం జరిగిందన్నారు.
జిల్లా స్ధాయిలో అవార్డులు అందుకున్న పంచాయతీలివే..
ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లి పంచాయతీకి తగినంత నీరు కల్పనలో, భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీకి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కల్పనలో , దెందులూరు మండలం చల్లచింతలపూడి పంచాయతీకి సామాజికంగా సురక్షితం అనే అంశంలో , ఏలూరు మండలం కలకుర్రు పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ అంశంలో , కామవరపుకోట మండలంలోని రామన్నపాలెం పంచాయతీకి , కలిదిండి మండలం పెదలంక పంచాయతీకి తగినంత నీరు కల్పనలో , మండవల్లి మండలం కనుకొల్లు పంచాయతీకి పేదరికం లేని , మెరు గైన జీవనోపాధి అంశంలో , మండవల్లి మండలం మండవల్లి పంచాయతీకి ఆరోగ్యకరమైన పంచాయతీ అంశంలో , మండవల్లి మండలంలోని పుట్టచెరువు పంచాయతీకి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కల్పనలో , ముది నేపల్లి మండలం పెయ్యేరు పంచాయతీకి సామాజికంగా సురక్షితం అనే అంశం , ముదినేపల్లి మండలం పెదపాల ప పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ అంశంలో , ఉంగు టూరు మండలం ఉంగుటూరు పంచాయతీకి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కల్పనలో జిల్లాస్థాయి అవార్డులు లభించాయి. కలకుర్రు సర్పంచ్ నాగ ప్రసాద్ కి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు చేతుల మీదుగా, మల్కాపురం కార్యదర్శి సుమలత కు జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి చేతుల మీదుగా అవార్డు, ప్రశంస పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జడ్పిసీఈఓ కె రవికుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author