మంచిపని ఒక్కటైనా చేశావా?!
1 min readపల్లెవెలుగు:పాదయాత్ర దారిలో పులికనుమ కెనాల్ ను చూసిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించింది. తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్ కు నీరు నిలిపివేసినపుడు ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా కోసిగి మండలం పులికనుమ వద్ద రూ. 261కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని గత టిడిపి ప్రభుత్వ హయాంలో పూర్తిచేశారు. దీనిద్వారా 64 గ్రామాలకు తాగునీరు, 26వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కళ్లలో ఆనందం చూసేలా ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీఅంటూ చురకలంటించారు.