లోకేష్‌కు…నీరాజనం..
1 min readకోసిగిలో అడుగడుగునా యువనేతకు అపూర్వ స్వాగతం
- మంత్రాలయం నియోజకవర్గంలో జనహోరు
మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వరోజు మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రవేశించింది. గవిగట్టు క్రాస్ వద్ద మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ కు ఇన్చార్జి తిక్కారెడ్డి, టిడిపి కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో యువగళం పాదయాత్ర కేక పుట్టించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు. యువనేతను లోకేష్ ని చూసేందుకు భారీగా మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. మెయిన్ రోడ్డు పక్కన ఉన్న భవనాల పైకి ఎక్కిన జనం యువనేతకు అభివాదం చేశారు. దారిపొడవునా అందరినీ ఆప్యాయంగా పలకరించిన యువనేత వారితో ఫోటోలు దిగారు. తనని కలవడానికి వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వచ్చే ఆదాయంతో బ్రతకడం కష్టం గా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కోసిగి యల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపులదొడ్డి, పీకలబెట్ట, కోసిగిలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలపై యువనేతకు వినతిపత్రాలు సమర్పించారు. కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో జరిగిన బహిరంగసభకు భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు. అనంతరం కోసిగి శివారు విడిది కేంద్రానికి చేరుకున్నారు.