జిల్లా కేంద్రాల్లో హెల్త్ హబ్స్: జగన్
1 min readపల్లెవెలుగు వెబ్: జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని, కనీసం 16 చోట్ల రాష్ట్రంలో హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అన్నారు. కరోన కట్టడి చర్యలు, రాష్ట్రంలో వైద్య సదుపాయాల మీద ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో జిల్లాలో కనీసం 40 నుంచి 50 ఎకరాలు సేకరించాలని, ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు కేటాయించాలని ఆయన అన్నారు. మూడేళ్లలో కనీసం 100 కోట్లు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు స్థలం కేటాయించాలని, దీనివల్ల 80 సూపర్ , మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఆధ్యర్యంలో మరో 16 వైద్య, నర్సింగ్ కళాశాలలు రాష్ర్టంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.