పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి : ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని బుధవారం నాడు జెఎస్డబ్ల్యు సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన బూజునూరు బిలకల గూడూరు గ్రామా పంచాయతీలకు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో ఇప్పుడిప్పుడే పరిశ్రమల స్థాపన కోసం యాజమాన్యాలు ముందుకొస్తున్నాయని వైసిపి ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు ముఖ్యంగా పిన్నా పురంలో గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కింద చేపట్టిన పరిశ్రమ వేలాది ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తుందని పరిశ్రమలు ఉండడం స్థానికంగా గ్రామాలలో యాజమాన్యాల చేయూతతో అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు. జిందాల్ సిమెంట్ పరిశ్రమ రెండు దత్తత గ్రామాలకు ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేశాయని రాబోవు రోజుల్లో కూడా ఇంకా యాజమాన్యం సహకారం ఉండాలని అడిగిన వెంటనే జిందాల్ యాజమాన్యం ప్రస్తుతం రెండు గ్రామాలకు డ్రైనేజీ సౌకర్యం కోసం 85 లక్షలు కేటాయించినట్టు తెలిపారు శివరాంరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చెందుతున్నాయని ప్రస్తుతానికి బుజనూరు గ్రామంలో మూగజీవాలు మేపుకోవడానికి కొండ వాగు పైన బ్రిడ్జి మంజూరు చేయాలని అలాగే పాఠశాలకు ఆట స్థలం కోసం 25 సెంట్లు భూమిని మంజూరు చేయాలని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండవాగుపై బ్రిడ్జి ప్రతిపాదన ఫైలును సీఎం వద్దందని త్వరలో అనుమతులు మంజూరై నిర్మాణం చేపడతామని తెలిపారు. రఘు మాధవరెడ్డి మాట్లాడుతూ బూజునూరు గ్రామానికి జెఎస్డబ్ల్యు పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలను అడిగిన వెంటనే ఎమ్మెల్యే సహకారంతో మంజూరు కావడం సంతోషకరమని రానున్న రోజుల్లో. భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాలలో ప్రతి ఒక్కరికి పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించెలా యాజమాన్యం చొరవ తీసుకోవాలని కోరారు. జిందాల్ సి ఈ ఓ నీలేష్ నార్వేకర్ మాట్లాడుతూ 2008లో పరిశ్రమ మొదలైందని స్థానికంగా ప్రజలు అధికారులు నాయకుల సహకారంతో విజయవంతంగా సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నట్టు రాబోయే కాలంలో దత్తత గ్రామాలకు కావలసిన మౌలిక సదుపాయాలకు నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమకు స్థానికంగా అన్ని సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రెండు గ్రామాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి శివరాం రెడ్డి రఘు మాధవరెడ్డి. బూజునూర్ సర్పంచ్ ఎల్లంపల్లి రాములమ్మ. బిలకల గూడూరు శేఖర్ రెడ్డి. జిందాల్ సీఎం ఓ వంశీధర్ రెడ్డి. హెచ్ ఆర్ హెడ్. నవనీత్ కుమార్.. సిఎస్ఆర్ హెడ్ రవికుమార్. రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.