PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అకాల వర్షం-మిర్చి రైతులకు అపార నష్టం

1 min read

– రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి…
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మిర్చి రైతులకు అపార నష్టం వాటిలిందని మండలంలోని రైతులు వాపోయారు.కులుమాల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి వరద నీరు ఏరులై పారుతూ పండించిన పంటను కల్లాల్లో అరవేసుకున్న మిర్చిపై భారీగా నీళ్లు దోర్లడంతో మిర్చి పంట అంతా వరదలో కొట్టుకుపోయి రైతులకు అపార నష్టం వాటిల్లిందనీ కులుమాల గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎకరాకు రెండు లక్షల చొప్పున ఖర్చు చేసి పండించిన పంట ఒకేసారిగా వరదనీటిలో కొట్టుకపోవడంతో రైతులు దిక్కు సూచని స్థితిలో ఏమి చేయాలో అర్థం కాక చావే శరణ్యం అంటూ బోరున విలపిస్తున్నారు.ప్రభుత్వమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. గ్రామంలో దాదాపు 20 మంది రైతులు మిర్చి పంటను వేసుకుని కల్లాల్లో ఆరవేసుకుని ఉండగా బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో ఉరుముల మెరుపులతో కురిసిన భారీ వర్షపు నీటిలో కొట్టుకపోవడంతో 20 మంది రైతులు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

About Author