గోనెగండ్ల మండలం లో పొంగిన వంకలు
1 min read– వరదకు కొట్టుకుపోయిన మిరప
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలంలో అనుకోకుండా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఎండాకాలం మండే ఎండల వేడిమి నుండి చల్లదనం తో సేదతీరేలా హాయిని ఇచ్చింది. అయితే అకాల వర్షం రావడంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి.గోనెగండ్ల మండలం లోని గోనెగండ్ల కులుమాల, పెద్ద మరివీడు, అలువాల గ్రామాల్లో వంకలు పొంగి ప్రవహించడం తో కులుమాల గ్రామానికి చెందిన దాదాపు ఇరవై మంది రైతులు పొలంలో ఆరబోసిన మిరప పంట మొత్తం గాజులదిన్నే వంకలో కొట్టుకు పోయాయి.రైతు రాజేష్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల కల్లం లో ఎండపోసిన మొత్తం పది క్వింటాలు మిరప వంకలో కొట్టుకుపోవడంతో దాదాపుగా రెండు లక్షలు రూపాయలు నష్టం వాటిల్లిందని రాత్రి పగలు కష్ట పడిన పంటంతా వరద పాలు అయ్యి మాకు కన్నీళ్లు మిగిల్చిందని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు.ఈ అకాల వర్షం కొందరికి మోదాన్ని మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది.