జగద్గురు ఆదిశంకరాచార్యులు మార్గం సర్వ మానవాళికి శరణ్యం..
1 min read– ఏపీ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం కన్వీనర్అ.. ప్పల భక్తుల శివకేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జగద్గురు ఆదిశంకరాచార్యులు చూపిన ఆధ్యాత్మికమార్గం సర్వ మానవాళికి శరణ్య మని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం కన్వీనర్ అప్పలభక్తుల శివకేశవరావు అన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిమహోత్సవాన్ని హేలాపురి విశ్వబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గూడూరిహేమదుర్గాప్రసాద్ అధ్యక్షతన కామాక్షి విశ్వబ్రాహ్మణ ధర్మపీఠంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు శంకరాచార్యుల చిత్రపఠానికి పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రసాదవితరణచేశారు . ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ వెల్ఫైర్ కార్పోరేషన్ డైరెక్టర్ లక్కోజురాజగోపాలాచారి శంకరాచార్యులవారి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నవిశ్వ బ్రాహ్మణ సంఘాలకు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్రకోశాధికారి వేములదుర్గాప్రసాద్ విశ్వబ్రాహ్మణ ఉద్యోగవ్యాపారస్థులసంక్షేమసంఘం ప్రధానకార్యదర్శి లంకలపల్లిజగదీష్ఉషాధ్యక్షులు లక్కోజు కొండా కోశాధికారి నాగమల్లిదుర్గారావు పశ్చిమగోదావరి జిల్లావిశ్వబ్రాహ్మణసంఘ ఉపాధ్యక్షులు పొట్నూరిశివరావు బ్రహ్మంగారిఆలయ కమిటి కార్యదర్శి ముశినాడశేఖర్ మాజిచైర్మన్ యలబాకకృష్ణ బిసిజాతీయసంఘంజాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి రంగమ్మత్యాలు రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి శివశ్రీ మాట్లాడుతూ భారతదేశంలో విభిన్నమతాలమధ్యవై షమ్యాలు ప్రబలుతూ సనాతనధర్మానికి హాని కలుగుతున్న కాలంలో కేరళరాష్ట్రంలోని కాలడిఅనేగ్రామంలో పౌరుషేయ విశ్వబ్రాహ్మణ వంశంలో ఆర్యాంబ శివగురు వు అనే పుణ్యదంపతులకు శంకరులు జన్మించారన్నారు చిన్నవయసులోనే బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులకు భాష్యంవ్రాశారన్నారు ఇవి ప్రస్థానత్రయముగా ప్రశిధ్ధిచెందినవని తెలిపారు. భౌనవిశ్వకర్మప్రతిపాదించిన అద్వైత శిధ్ధాంతానికి విస్తృతప్రాచుర్యంకల్పించి నాలుగువేదాలసారమైన నాలుగుమహావాక్యాల సారాంశాన్ని జనబాహుళ్యంలో విస్త్రుతప్రచారానికి నలుదిశలా పీఠాలను స్థాపించారని తెలిపారు. శంకరులు ప్రతిపాదించిన శిధ్ధాంతాన్ని మరోసద్గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆచరించిచూపారన్నారు. ఙ్ఞానవంతుడైనచండాలుణ్ణి పండితుణ్ణిస మదృష్టితో చూడాలన్నశంక రభాష్యం సమానత్వాన్ని సూచిస్తుందని ఆయనప్రభోధాలు అవగాహనచేసుకోవడంద్వారా ఙ్ఞానాన్ని ఆర్జించ గలుగుతామన్నారు శంకరులు వీరబ్రహ్మేంద్రస్వామి ఇద్దరు జగద్గురువులజయంతి ఆరాధన మహోత్సవాలను ఆధ్యాత్మిక వారోత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.