అమృత్ సరోవర్ పనుల పరిశీలన..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉపాధి హామీ పథకం కింద అమృత్ సరోవర్ పనుల ప్రతిపాదికన ఎల్కే తాండ గ్రామంలోని కుంటలో పని చేస్తున్న ప్రాంతాన్ని గురువారం నాడు పిడి రామచంద్రారెడ్డి పర్యటించారు అనంతరం కూలీలతో మాట్లాడుతూ వేసవికాలంలో రక్షణ కొరకు ఏర్పాటు చేస్తున్న టెంట్లు మంచినీటి సౌకర్యం ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఉపాధి కూలీ 272 పడి విధంగా పని చేయాలన్నారు మండల వ్యాప్తంగా 5000 మంది ఉపాధి హామీ పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు అనంతరం గని గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు పిడి వెంట ఏపీవో వెంకటరమణ టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ బీఎఫ్టి రామోజీ నాయక్ పాల్గొన్నారు.