137 మే డే ను జయప్రదం చేయండి ఏఐటియుసి పిలుపు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో సిపిఐ ఏ ఐ టి యు సి అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చిన AITUC నంద్యాల జిల్లాప్రధానకార్యదర్శిసుంకయ్య137వ మే డే ను బనగానపల్లి పట్టణంలో AITUC అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించాలని ఈ మేడే కార్యక్రమంలో బనగానపల్లి నియోజకవర్గం లో ఉన్నటువంటి ఆటో, అంగన్వాడి, ఆశ,మధ్యాహ్న భోజన వర్కర్స్ మరియు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కదం తొక్కి మేడం జయప్రదం చేయాలని ఈరోజు బనగానపల్లి ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగినటువంటి AITUC అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం బనగానపల్లె ఏఐటియుసి అధ్యక్షులు జి కుల్లాయి స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, AITUC నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివ బాలకృష్ణ పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో సుంకయ్య గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని చేస్తున్న అన్యాయం గురించి కార్మికుల కోడ్స్ రద్దు గురించి కాంద్రీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దించాలని మేడైన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడు కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మేడేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి , గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాలింగ్ రాముడు ,సిపిఐ నాయకులు శివ నాగయ్య, ఏఐటీయూసీ రవి తదితరులు పాల్గొన్నారు .