నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : అకాల వర్షాలకు మెరప పంట దెబ్బతిన్న రైతులకు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పి.రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్నాథం లు అన్నారు.గోనెగండ్ల మండల పరిధిలోని అలువాల, కులుమాల గ్రామంలో సీపీఐ రాష్ట్ర రైతు సంఘం నాయకులు పర్యటించారు.అందులో భాగంగా అలువాల, కులుమాలు గ్రామాల రైతులు మల్లేష్, నరసింహుడు,సుంకన్న ల రైతుల మెరప పంట పొలాలను పరిశీంచారు.బుధవారం తెల్లవారుజామున అకాల వర్షం కు,మెరప పంట నీటిలో కొట్టుకొని పోయి.దాదాపు రైతు 2లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని రైతులు సీపీఐ పార్టీ నాయకులు ముందర వాపోయారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పి.రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్నాథం వారు మాట్లాడుతూ ఆకాల వర్షం కు మిర్చి పంట నీటిలో తడిసిపోయి.రైతులకు టార్పాలు ఇవ్వాలి.కానీ వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏ సంక్షేమ ఫథకం చేయలేదు.అయితే ఇంతా జరిగిన తహశీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇంతా వరకు చూడటానికి రాలేదు అని అన్నారు.నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సత్యన్న, సీపీఐ మండల కార్యదర్శి నాగప్ప, ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి బాలరాజు, గోపాల్,వీరేష్, అహ్మద్,సి నాగేష్,రామలింగు,ముసలయ్య, నరసింహుడు,కాజ, హనుమంతు, దుబ్బన్న, వెంకటేష్, ఈరన్న, జయరాముడు, శీను వాసులు తదితరులు పాల్గొన్నారు.
పొలాలు, పెట్టుబడి, 2 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తహశీల్దార్,