అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా మధ్య నిషేధ మరియు ఆప్కారి శాఖ జిల్లా అధికారి రవి కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆయన గురువారం చాగలమర్రి పట్టణంలోని మల్లె వేముల బస్టాండ్ లో గల మద్యం దుకాణం, రచ్చబండ, ముత్యాలపాడు బస్టాండ్ లో గల మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ స్టాక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం మద్యం దుకాణాల సూపర్వైజర్లు, సేల్స్ మేన్ లకు మద్యం అమ్మకాల గురించి, స్టాకు బిల్లులకు సంబంధించిన విధి విధానాలను వివరించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే వినియోగదారులకు మద్యం దుకాణాల్లో ప్రభుత్వాన్ని నిర్ణీత తరలకు మద్యం విక్రయిస్తున్నారా లేదాఅని తెలుసుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈయన వెంట హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.