NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లక్ష 15 వేల రూ. ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు మండలం దిన్నేదేవరపాడు గ్రామంలో ఏ పి వైస్సార్ క్రాంతి పథంలో దీన్నేదేవరపాడు వి ఒ ఏ గా పనిచేస్తున్న లక్ష్మిదేవి ఈ మధ్యకాలంలో అనారోగ్య కారణం వలన మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న ఏ పి వైస్సార్ క్రాంతి పథం వి ఒ ఏ ఉద్యోగుల సంఘం కర్నూలు యూనియన్ వారు గతంలో తీసుకున్న తీర్మానం ప్రకారం శుక్రవారం జిల్లా ఏ పి వైస్సార్ క్రాంతి పథం వి ఓ ఏ ల యూనియన్ తరపున మరణించిన వి ఒ ఏ లక్ష్మిదేవి కుటుంబానికి ఒక లక్ష పదహైదు వేల (రూ.115000)రూపాయలు ఆర్థిక సహాయం అందింఛారు. ఈ కార్యక్రమం జిల్లా యూనియన్ అధ్యక్షులు సి. బసవరాజు ఆధ్వర్యంలో నిర్వహించి యూనియన్ జిల్లా కమిటీ సమక్ష్యం లో జిల్లాలో ఉండే వి ఒ ఏ ల అందరి సహకారంతో అందించామని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి రంగన్న, కోశాధికారి పద్మావతి,గౌరవధ్యక్షులు మద్దిలేటి,ఉపాధ్యక్షులు వరలష్మి, రవికుమార్ లు మరియు ఉపకార్యదర్శి భాస్కర్ నాయుడు, కర్నూల్ మండలం గౌరవధ్యక్షులు బాలస్వామి,గోనెగండ్ల మండల నాయకులు లోకనాథ్ రెడ్డి, మిన్నెల్లా మరియు మండల లీడర్ లు పరమేష్, రవి, ప్రకాష్,ఈశ్వర్, తిక్కన్న, రామ్ మూర్తి మరియు వి ఒ ఏ లు అందరూ పాల్గొన్నారు.

About Author