PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీ నైపుణ్యత…అత్యవసరం..

1 min read

కేవీ సుబ్బారెడ్డి గ్రూపు విద్యాసంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి

పల్లెవెలుగు:ఐటి నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి సాఫ్ట్ వేర్ కంపెనీలు ముందుకు రావడం హర్షణీయమన్నారు కేవీ సుబ్బారెడ్డి గ్రూపు విద్యాసంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి. స్థానిక బి. తాండ్రపాడులోని జెనిత్ కోచింగ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజంలో విద్యార్థులకు ఐటి నైపుణ్యత ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు ఈ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ యస్పీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత అభివృద్ధి చెందిన హైదరాబాద్ మహానగరాన్ని మనం వదులుకున్నామని, ఐటి రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ వంటి నగరం ఆంధ్రప్రదేశ్ కు లేకపోవడం మనకు తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విప్రో హైదరాబాద్ కంపెనీ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాజుల మురళి కృష్ణ మాట్లాడుతూ . . .   సమాచార మరియు సాంకేతికత (IT) ఆధునిక సమాజంలో కీలక పాత్ర పోషిస్తుంది అని,  పెరిగిన సామర్థ్యం IT డేటా ప్రాసెసింగ్ మరియు నిర్వహణ యొక్క సమర్థవంతమైన సాధనాలను అందిస్తుంది అని , ఇది వివిధ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి . ఫైనాన్స్, హెల్త్‌కేర్ మరియు లాజిస్టిక్స్ వంటి సామర్థ్యం కలిగిన పరిశ్రమలలో ఇది చాలా ఉపయోగపడుతుంది అని అలాగే IT కమ్యూనికేషన్‌ను విప్లవాత్మకంగా మార్చింది,   ఇమెయిల్, మెసేజింగ్ యాప్‌లు, వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వ్యక్తులు వారి స్థానంతో సంబంధం లేకుండా కనెక్ట్ అవ్వడాన్ని సులభతరం చేశాయి తెలియజేశారుకర్నూలు వంటి ద్వితీయ శ్రేణి నగరాలు ఐటి రంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. జెనిత్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఎన్వీ ఖాన్ మాట్లాడుతూ పలు ప్రముఖ సంస్థలు తమతో ఎంవోయు కుదుర్చుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన ఐటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author