ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగం : డాక్టర్ శంకర్ శర్మ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ పెద్ద మార్కెట్ కేఎంసి కింగ్ పార్క్ లో లక్ష్మీ కళ్యాణం హాల్లో జిల్లా క్రీడా ప్రాధికార సమస్త ఆధ్వర్యంలో టైక్వాండో వేసవి శిక్షణ శిబిరానికి డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి సహకారంతో వేసవి శిక్షణ శిబిరానికి టైక్వాండో అభినందించడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో బాలికల, మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ అవసరమని చదువుతోపాటు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ వంటిపై మహిళలు దృష్టి సారించాలన్నారు. చిన్నప్పటినుంచి అమ్మాయిలకు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలిఆత్మ రక్షణకు తోడ్పడుతుందని టైక్వాండో క్రీడా ఎంతో అవసరమని క్రమశిక్షణతో నేర్చుకోవడంతో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ శిక్షణ మానసిక, శారీరక ,ఉల్లాసంగా పాటు విద్య ఉద్యోగులో మెరుగైన అవకాశాలు ఉంటాయని మరియు విద్యార్థిని, విద్యార్థులు ఎండాకాలం ఎక్కువ ఉన్నందుకు నిమ్మకాయ రసము మజ్జిగ నీళ్లు ఎక్కువ తీసుకోవాలని తెలియజేశారు.