ఇళ్ల స్థలాల కోసం…మాజీ సైనికుల దరఖాస్తు
1 min readమాజీ సైనికుల సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పేరయ్య
పల్లెవెలుగు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న మాజీ సైనికులు ఉచిత ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు మాజీ సైనికుల సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పేరయ్య. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2013లో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ సుదర్శన్ రెడ్డి సహకారంతో 319 మంది మాజీ సైనికులు ఇళ్ల స్థలాలు పొందారని…. ప్రస్తుతం కూడా మాజీ సైనికులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. అందుకుగాను ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 771 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ జాబితా జిల్లా సైనిక్ బోర్డు నుంచి ఆన్లైన్లో కలెక్టరేట్‌కు వెళ్లిందన్న పేరయ్య… దరఖాస్తుదారుల జాబితాను తాము కూడా కలెక్టర్‌గారికి అందజేశామన్నారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యుద్ధవీరుల స్మారకార్థం వార్ మెమోరియల్ నిర్మించారని, కర్నూలు జిల్లాలో లేనందున …నగరంలో వార్ మెమోరియల్ కట్టించి ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరినట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పేరయ్య వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుత పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి కూడా ఇళ్ల స్థలాల దరఖాస్తుదారుల జాబితాను అందజేసి.. సహకరించాలని కోరినట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పేరయ్య తెలిపారు.