PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్తమాని ఇలా అధిగమిద్దాం

1 min read

– అంతర్జాతీయ ఆస్తమా దినోత్సవం మే 2న
– డా. సువర్ణ లక్ష్మి కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్
– కిమ్స్ సవీర, అనంతపురం.
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద శ్వాసకోస సమస్య ఆస్తమా (ఉబ్బసం). వాతావరణంలో క్రమ క్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వలన ప్రపంచ జనాభాలో దాదాపు 24.5 కోట్లకు పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో వాయి మార్గాల వాపు మరియు సన్నబడడం వలల గాలి వేగంగా పీల్చడం, పిల్లి కూతలు ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి రావడానికి కారణాలుజన్యుపరమైన మరియు పర్యావరణ అంశం కూడా ఉంది. సాధారణ ఇండోర్ అలెర్జీ (దుమ్ము పురుగులు, పెంపుడు జంతువులు, బొద్దింకలు) వైరల్ ఇన్ఫెక్షన్లు, పొంగమంచుతో కూడిన పర్యావరణ పరిస్థితులు, అధిక తేమ, ధూమపానం, అధిక బరువు మరియు కొన్ని మందులు ఆస్పిరిన్, నాప్రొక్సెన్, బీటా-బ్లాకర్స్ ఈ పరిస్థితికి కారణం కావచ్చు. వ్యాధిని ఎలా నిర్థారించవచ్చువైద్య చరిత్ర, శారీరక పరీక్ష మరియు స్పిరోమెట్రీ వల్ల ఆస్తమాని నిర్థారణ చేయవచ్చు. మందులు, శ్వాస వ్యాయామాలు మరియు జీవన శైలి మార్పులు, అలెర్జీ మరియు ఎసిడిటి సమస్యలకు చికిత్స తీసుకోవడం ఇన్ఫ్లుఎంజా న్యుమోనియా కోసం టీకాలు తీసుకోవడం వల్ల దీనిని నియంత్రించవచ్చు. ఆస్తమాపై అపోహలు – వాస్తవాలుబాల్యంలో ఆస్తమా వస్తే వయస్సుతో పాటు తగ్గుతుంది అనేది అపోహ మాత్రమే కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలిఅపోహ – ఆస్తమా ఉన్నవాళ్లు వ్యాయామం చేయకూడదువాస్తవం – క్రమతప్పకుండా వ్యాయామం, యోగా, ప్రాణాయనం చేయడం, ఆస్తమా రోగులకు ప్రయోజనం ఉంటుంది. అపోహ – ఆస్తమా కోసం వాడే మందులు అలవాటు అయిపోయి, కాలక్రమేణా అవి పనికిరావువాస్తవం – ఆస్తమా మందులు సురక్షితమైనవి, ఆస్తమా అనేది దీర్ఘకాలిక పరిస్థితి కాబట్టి వాటి లక్షణాలు తగ్గించడానికి దీర్ఘకాలిక మందులు అవసరం. అపోహ – చాపమందుతో తగ్గిపోతోంది. వాస్తవం – చాపమందుతో ఆస్తమా తగ్గదు. అంతేకాకుండా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ వ్యాధి పూర్తిగా నివారించలేం, కానీ మనం సరైన చికిత్సా విధానం పాటించడం వల్ల చాలా వరకు దీనిని నియంత్రిచవచ్చు. అలా కాకుండా ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మన ఊపిరితిత్తులలో మార్పులు చోటే చేసుకొని అవి ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. అందువలన తొలిదశలోనే ఛాతి వైద్య నిపుణులను సంప్రదించి ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

About Author