కర్నూల్ లో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తాం
1 min read– కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాసవి బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సొమిసెట్టి నవీన్ కుమార్,వాసవి సేవాదళ్ అధ్యక్షులు పాలూరి కిషోర్, కార్యదర్శి లగిశెట్టి కిషోర్, కోశాధికారి మేడం జగదీష్, మాజీ అధ్యక్షులు శేష పని శెట్టి, కమలాపురం సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ మాట్లాడుతూ నగరంలో వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. గతంలో వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారని, ప్రస్తుతం బ్యాడ్మింటన్ పోటీలను కూడా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. స్వతహాగా తాను కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడినని, సౌత్ జోన్ వరకు బ్యాడ్మింటన్ ఆడానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడని ఎంచుకొని అందులో రాణించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనేవారు బాడీ ఫిట్నెస్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని.. అప్పుడే క్రీడల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి బ్యాడ్మింటన్ లీగ్ పోటీల్లో ప్రథమ బహుమతిగా 15000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా పదివేల రూపాయలను తనవంతుగా అందజేస్తానని ఆయన వివరించారు. నగరంలో ప్రతి సంవత్సరం పోటీలను నిర్వహిస్తున్న వాసవి సేవా దళ్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వాసవి సేవా దళ్ ప్రతినిధులు మాట్లాడుతూ నగరంలో తాము చేపడుతున్న కార్యక్రమాలకు యువనేత టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిది అని చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాసవి బ్యాడ్మింటన్ లీవ్ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రకటించడం క్రీడల పట్ల ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆయన సహకారం ఇలాగే ఉండాలని కోరారు.