కె.పి.ఎల్ సీజన్ 2 క్రికెట్ పొటీలను ప్రారంభించిన టీజీ భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో టీజీవి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేపీఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జంకేర్ కామినేని హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్, పోటీల నిర్వహకుడలు పార్థు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ మాట్లాడుతూ నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో కర్నూల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఎంచుకున్న రంగాలలో రాణిస్తారని ఆయన వివరించారు. కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన తెలియజేశారు. పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. క్రీడల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొన్నమా లేదా అన్నది ముఖ్యంగా భావించాలని చెప్పారు. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం వల్ల నూతన స్నేహితులు పరిచయమవుతారని ఆయన అన్నారు.