ఉర్దూ మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం ప్రారంభం
1 min read– ఇక పై ఉర్దూ మాధ్యమం తో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల (మైనారిటీస్)
– కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పేద ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య చాలా భారంగా మారడంతో చాలామంది విద్యార్థులు పదవ తరగతి తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నారని ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభం చేయడానికి కళాశాల ప్రిన్సిపాల్ తో చర్చించారు. కర్నూలు జిల్లా లోని ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ప్రభుత్వ జూనియర్ కళాశాల (మైనార్టీస్) ఓల్డ్ టౌన్, కర్నూలు లో ప్రారంభిస్తున్నట్లు కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియం చేసుకోవాలని మరిన్ని వివరాల కొరకు కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవలసిన తెలియజేశారు .