PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం..జిల్లా ఎస్పీ

1 min read

– స్పందన కార్యక్రమానికి 93 ఫిర్యాదులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 93 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) నకిలీ పట్టా భూమి ఇచ్చి ఒక వ్యక్తి నన్ను మోసం చేశారని కర్నూలు , బి. తాండ్రపాడు గ్రామానికి చెందిన రిటైర్డు ఉద్యోగి పి. జగన్నాథుడు ఫిర్యాదు చేశారు.
2) సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశారని కర్నూలు , ధనలక్ష్మీ నగర్ కు చెందిన ఉదయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
3) కుమారులు అన్నం పెట్టకుండా వేధిస్తున్నారని ఆలూరు మండలం, మన్యకుర్తి గ్రామానికి చెందిన ఎల్లమ్మ ఫిర్యాదు చేశారు.
4) మండల సర్వేయర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని పత్తికొండ మండలం, హోసూరు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
5) నా భర్త బతికి ఉన్నప్పుడు పొలం కోనుగోలు కు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుగ్గలి మండలం, బొద్ది మడుగుల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీ నాగభూషణం , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.

About Author