మల్లికార్జున రిజర్వాయర్ పై ఎమ్మెల్యే,ఎంపీ మాట్లాడాలి
1 min read– నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్రానికి లేదా..?
– కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపికి
పుట్టగతులు ఉండవ్:ఏపీ రైతు సంఘం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల కేంద్రంలో ఆటో స్టాండ్ దగ్గర మంగళవారం 137వ మేడే కార్యక్రమం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.రైతు సంఘం సీనియర్ నాయకులు వి.నాగరాజు,జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకుడు వి రామకృష్ణ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలను బానిసలుగా చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని అన్నారు. కార్మికుల జెండాను మేడేగా జరుపుకుంటున్నామని ఆయన వివరించారు.బిజెపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ పెట్రోల్, డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆయన మండిపడ్డారు.ఒకపక్క రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అతివృష్టి అనావృష్టితో చేతికి వచ్చిన పంటలు నాశనం కావడంతో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ పనిని ఎత్తివేయడానికి ఎన్నో ఆంక్షలు తీసుకొస్తున్నారని అన్నారు.అందుకు రైతు కూలీలు కార్మికులు ఈసమస్యలు పరిష్కారం కొరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా మిడుతూరు మండలంలో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయవలసి ఉండగా రైతుల భూములను లాక్కునే దాని కొరకు మల్లికార్జున రిజర్వాయర్ పేరుతో రైతుల భూములను లాక్కొని ఇతర ప్రాంతాలకు నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఈప్రాజెక్టు పైన ఎమ్మెల్యే,ఎంపీ అధికారికి ప్రకటన ఇవ్వాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకుడు ఓబులేష్,మద్దిలేటి,బి హరి నాయుడు, శేఖర్,సుజ్ఞానం,వి రమణయ్య, శ్రీనివాసులు,సుబ్బన్న,శివరాముడు తదితరులు పాల్గొన్నారు.