10 లోగ పెన్షనర్లు ఈకెవైసీ త్వరగతిన చేయించుకోవాలి..
1 min read– జిల్లా ఖజానాధికారి టి కృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ విధిగా తమ సీఎఫ్ ఎంఎస్ ఐడీలను ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్కు అనుసంధానం చేయాల్సి ఉందని జిల్లా ఖాజానాధికారి టి. కృష్ణ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎఫ్ఎంఎస్ ఐడీ, హెచ్ఆర్బీ, పేరోలకు సంబంధించిన సేవలను పొందాలంటే ఈ అనుసంధానం అత్యవసరమని పేర్కొన్నారు. ఖజానా, లెక్కల శాఖ సంచాలకుల ఆదేశానుసారం ఈనెల 10వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉం దని తెలిపారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ఆయా మండలాల్లో ఈకేవైసీ నమోదుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఏలూరు జిల్లా పరిధిలోని చింతలపూడి ఉప ఖజానా కార్యాలయ ఎగువశ్రేణి గణాoకులు వి.వీర్రాజు, సిబ్బంది మండల పరిషత్ కార్యాలయము టీ.నర్సాపురంలో అందుబాటులో ఉంటారు. కావున ఈ మండల పరిధిలో గల విశ్రాంత ఉద్యోగులు ఈ సేవలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.