PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయలి

1 min read

– అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విసి & యండి జి.వీర పాండ్యన్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: మంగళవారం తాడేపల్లిగూడెం మండలం నవాబ్ పాలెం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని , యల్.అగ్రహారం శ్రీనివాస రైస్ మిల్లును జిల్లా జాయింటు కలెక్టరు ఎస్. రామ్ సుందర్ రెడ్డి తో కలసి సివిల్ సప్లై డి యం జి. వీరపాండ్యన్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకూ ఎంత మంది రైతులు వచ్చారు, ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ఆయన అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, తేమ శాతం లెక్కింపు యంత్రాలను, కాటా, స్టాక్ రూమ్ తది వాటిని పరిశీ లించి, అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంలో రాష్ట్ర సివిల్ సప్లై విసి & యండి మాట్లాడుతూ గత విధానాలు ద్వారా రైతులకు మద్దతు ధర లభించడం లేదని, ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకు ఇబ్బంది లేని విధంగా నూతన ధాన్యం కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింద న్నారు.గతంలో దళారులు, మిల్లర్లు ప్రమేయంతో సరైన గిట్టు బాటు ధర లభించేది కాదన్నారు. ఈ విషయంపై రైతులలో తీవ్ర అసంతృప్తి ఉండేదని,రాష్ట్ర ప్రభుత్వం ఆర్ బి కేల ద్వారా ధాన్యం కొనుగోలను చేపట్టి మిల్లర్లను సర్వీస్ ప్రొవైడర్ గా ఉంచడం జరిగిందన్నారు. రవాణాలో ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించడం జరి గిందన్నారు. ఆర్ బి కే లో ఎఫ్.డి.ఓ జనరేట్ చేసిన తర్వాత మిల్లులు వద్ద తూకం, తేమశాతం లెక్కింపు తిరిగి సమీక్షించడం ఎట్టి పరి స్థితుల్లో ఉండదని తెలిపారు. ధాన్యం తూనికల యంత్రాలను 15 రోజులకు ఒకసారి చెక్ చేయించు కోవాలని అయన సూచించారు. ధాన్యంకు మద్దతు ధర కల్పించి రైతుల నుండి ఎవరైనా, ప్రైవేట్ వ్యక్తులైన ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చన్నారు. ఆర్.బి.కెల్లో గన్ని బ్యాగులు పూర్తి స్థాయిలో అందు బాటులో ఉంచామని అయన అన్నారు. జిల్లా జాయింటు కలెక్టర్లుకు పూర్తి అధికారాలు ఉన్నాయని వారి ఆదేశాలను తప్పక పాటించాలని అయన తెలిపారు. రైస్ రీసైకిల్ చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ఇటు వంటి వాటిని ఎవరు ప్రోత్సహించవద్దని అయన తెలిపారు. గోడౌన్లు పూర్తి స్థాయిలో అందు బాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులు మిల్లర్లు దగ్గరకు వస్తే ఆర్బికేలు పంపాలని ఆయన సూచించారు. రైస్ మిల్లులో సీసీ కెమెరాలను తప్పక ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర సివిల్ సప్లై యం డి వీర పాండ్యన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి యన్.సరోజ, సివిల్ సప్లై డి యం టి. శివ రామ ప్రసాద్, తహశీ ల్దారు వై కె వి అప్పారావు, వ్యవసాయ శాఖ ఏ వో ప్రసాద్, రైతులు , తది తరులు పాల్గొన్నారు.

About Author