PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మే 9 వ తేదీ నాటికి ఫీవర్ సర్వే పూర్తి చేయాలి

1 min read

– కోవిడ్ లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలి
– రక్త హీనత ను గుర్తించిన బాలికలకు మూడు రోజుల్లోపు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందించాలి
జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మే 9 వ తేదీ నాటికి ఫీవర్ సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన డి ఎమ్ హెచ్ ఓ ని ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుండి ఆరోగ్య వైద్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి. సృజన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్త హీనత కి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష లు పూర్తి చేసి రక్త హీనత ను గుర్తించిన బాలికలకు మూడు రోజుల్లోపు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మే 5 వ తేదీకి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఎంపిడిఓ లతో సమన్వయం చేసుకొని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సచివాలయం వారీగా పంపిణీ చేసిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు సెలవులు ఉన్నందున సచివాలయం లోని ఎ ఎన్ ఎం మరియు ఆశా వర్కర్లు 10 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిల ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డి ఎమ్ హెచ్ ఓ ని ఆదేశించారు. వైద్య శాఖ ద్వారా సేకరించిన 3,300 కి ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ల సంబంధించిన వివరాలను ఎంపిడిఓ లకు, డీఈవో కు పంపించాలని డి ఎమ్ హెచ్ ఓ ని ఆదేశించారు.కోవిడ్ టెస్టింగ్ కి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ సర్వే వేగవంతంగా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ సేకరించి 24 గంటలలోపు టెస్టింగ్ చేయాలన్నారు. 57 శాతం మాత్రమే ఫీవర్ సర్వే పూర్తయిందని, మే 9 వ తేదీ నాటికి ఫీవర్ సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపట్టలని ఆదేశించారు. ఫీవర్ సర్వే రిపోర్ట్స్ ప్రతి రోజూ పంపించాలని ఆదేశించారు. ఎన్ సి డి సర్వే కి సంబంధించి పరీక్షలు నిర్వహించి వారికి హెల్త్ ఐ డి జెనరేట్ చేయాలన్నారు. మండలాల వారీగా చేసిన రక్త హీనత కి సంబంధించి రోజు వారి పరీక్షలు నిర్వహించారా లేదా అని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ లను ఆరా తీశారు.. హోలగుంద లో ఎ ఎన్ ఎం రక్త హీనత కు సంబందించిన డేటా డిలీట్ చేసిందని, ఆమె పై యాక్షన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ ఎమ్ హెచ్ ఓ ని ఆదేశించారు.బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author