ప్రజలకు మరింత చెరువుగా మండల పరిషత్ సేవలు
1 min read– రాయచోటిలో మండల పరిషత్ సముదాయ నూతన భవనం ప్రారంభోత్సవంలోఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్ని వర్గాల ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు నూతనంగా నిర్మించిన మండల పరిషత్ భవన సముదాయం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నూతన భవనాన్ని ఎంపీపీ రాజమ్మ,స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి,బిసి నాయకుడు పల్లపు రమేష్ లతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేసే క్రమంలో సచివాలయ వ్యవస్థను పల్లె ప్రజల ముంగిటకు తీసుకువచ్చిందన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రతి పంచాయతీలో ఇంద్ర భవనాల్ల కనిపించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజి క్లినిక్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటిలో కోట్ల రూపాయలతో మండల పరిషత్ భవనాన్ని నిర్మించి అందుబాటులోకి రావడం శుభ పరిణామన్నారు. అభివృద్ధి లేదని విమర్శలు చేసే వారికి పంచాయతీలలో కనిపించే సచివాలయ భవనాలు, గ్రామీణ ప్రాంతాలకు ఏర్పాటుచేసిన తారు రోడ్లు, రాయచోటిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమాధానం చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, ఏపీ ఐ ఐ సి స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, వైస్ ఎంపిపి జయపాల్ రెడ్డి,వి ఆర్ రెడ్డి,ఎంపిడిఓ మల్ రెడ్డి, తహసీల్దార్ ప్రేమంత్ కుమార్, ఎంపీటీసీలు ప్రభాకర్ రెడ్డి,రామచంద్రా రెడ్డి,నాగసుబ్బమ్మ,చిట్టెమ్మ,నాగవేణి,సహదేవమ్మ, సర్పంచులు పోలు సావితమ్మ,రాయవరం మమత,కసిరెడ్డి సుబ్బలక్ష్మి, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి,ప్రభావతమ్మ ,తిరుపాల్ నాయుడు,ఫాహిదా,నాగవేణి,రెడ్డెమ్మ,వెంకటేష్ ,కో ఆప్షన్ సబ్గ్యులుఖాదర్ బాష, దివాన్,నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.