PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో HODS తో సమీక్ష సమావేశం

1 min read

– అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డా.సత్య వరప్రసాద్ మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం (న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్) మరియు పీజీ ఉమెన్స్ హాస్టల్ భవనాలను పరిశీలించారు.వైద్య కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో HODS తో సమీక్ష సమావేశం నిర్వహించి పలు వైద్య అధ్యాపకులతో వైద్య కళాశాల మరియు సర్వజన వైద్యశాల పై పలు సూచనలు తెలియజేశారు. న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ , పీజీ ఉమెన్స్ హాస్టల్ భవనాలను పర్యవేక్షించారు.ఇంచార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యరేపు జరగబోయే కార్యక్రమానికి డయాగ్నస్టిక్ బ్లాక్ మరియు పీజీ ఉమెన్స్ హాస్టల్ పనుల గురించి ఆరా తీశారు. అనంతరం ఇనాగరేషన్ , రూట్ మ్యాప్ లను పరిశీలించారు.స్టేట్ క్యాన్సర్ యూనిట్ బిల్డింగ్ మరియు మాస్టర్ ప్లాన్ పనులను పరిశీలించి అనంతరం ఎం సి హెచ్ విభాగాన్ని పరిశీలించారు అనంతరం అక్కడున్న డెలివరీ పేషెంట్ల గురించి తీశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ సాయి సుధీర్, డా.శ్రీహరి, డా.వెంకట రంగా రెడ్డి, మరియు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి డిప్యూటీ CSRMO, డా.హేమానలిని, డా.వెంకటరమణ, డా.శివ బాల నగాంజన్, మరియు వైద్య అధ్యాపకులు డా.శ్రీరాములు, డా.రామ్ శివ నాయక్, డా.రాధా రాణి, మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, తెలిపారు.

About Author