5న చెన్నకేశవ స్వామి రథోత్సవం
1 min read– ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం.. ఘనంగా కళ్యాణ మహోత్సవం
– మిడుతూరు చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమానికి అధికారుల ఏర్పాట్లు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఈనెల 5వ తేదీన సాయంత్రం జరిగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి గుర్రెడ్డి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు.శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా రెండవ తేదీ నుంచే సంబరాలు ప్రారంభం అయ్యాయి.బుధవారం రోజున ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగినది.ఈరోజు గురువారం రాత్రి గరుడోత్సవం 5వ తేదీ సాయంత్రం రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని తర్వాత 6వ తేదీ ఉదయం తీర్థావలి, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి.అదే రోజున పారువేట ఉత్సవం,ప్రదోష పూజలు హోమం బలిహరణం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం పొందుతారు.
అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలు
4వ తేదీ రాత్రి 9 గంటలకు గుండు పందెం చందా కాడి పట్లు పోటీలు ఉంటాయి.
5వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆర్కెస్ట్రా,రేలారే రేలా దుమ్ము రేపు జానపద ఆట వంటి కార్యక్రమాలు ఉంటాయి.6వ తేదీ శనివారం రాత్రి తొమ్మిది గంటలకు రేలారే రేలా దుమ్ము రేపు జానపద ఆట పాట వంటి కార్యక్రమాలు జరుగుతాయి.
హాజరు కానున్న ముఖ్య అతిథులు
5వ తేదీన జరిగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, దేవదాయ శాఖ నుంచి ఉప కమిషనర్ రాణా ప్రతాప్, జిల్లా ఎండోమెంట్ అధికారి సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆలయ కార్య నిర్వహణ అధికారి గుర్రెడ్డి అన్నారు.ఈకార్యక్రమాలు అన్నీ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.ఈరథోత్సవ కార్యక్రమం విజయవంతం అగుటకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.