PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హులైన లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.4.26 కోట్ల లబ్ది

1 min read

– జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా 574 మంది లబ్ధిదారులకు రూ.4.26కోట్ల లబ్దిజిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా జిల్లాలో 574 మంది లబ్ధిదారులకు రూ.4.26 కోట్ల లబ్ది చేకూరినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.శుక్రవారం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కోడుమూరు శాసన సభ్యులు డా.జె.సుధాకర్, నగర మేయర్ బివై.రామయ్య తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ జనవరి నుండి మార్చి, 2023 త్రైమాసికంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఉన్న ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా వారికి ఆర్థిక చేయూత అందించడం వల్ల ద్వారా అర్హులైన పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమలు చేయడం జరుగుతోందని, ఈ పథకం యొక్క లబ్ధి పొందాలంటే అమ్మాయి 18 సం.లు నిండడంతో పాటు అబ్బాయి 21సం.లు ఉండాలన్నారు. ఈ పథకాల వల్ల వెనుకబడిన కర్నూలు జిల్లాలో బాల్య వివాహాలు తగ్గడంతో పాటు ఆడపిల్లల చదువు ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు.వైఎస్సార్ కళ్యాణమస్తు/వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష , కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష 20 వేలు, అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు అందజేయనున్నారన్నారు.. అలాగే విభిన్న ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు/షాదీ తోఫా కింద రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ.40వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. పెళ్లి కర్నూలు జిల్లాలో జనవరి నుండి మార్చి, 2023 త్రైమాసికంలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా జనవరి నుండి మార్చి, 2023 త్రైమాసికంలో నూతనంగా వివాహం చేసుకొని మొత్తం 574 మంది లబ్ధిదారులు (బీసిలు – 305 (ఒక్కటే కులం – 300, కులాంతర వివాహం – 5) , విభిన్న ప్రతిభావంతులు – 6, మైనారిటీస్ – 99, ఎస్సీ – 152 (ఒక్కటే కులం – 149, కులాంతర వివాహం – 3), ఎస్టీ – 12 మంది లబ్ధి పొందారన్నారు.జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకం ద్వారా పేదింటి తల్లిదండ్రులకు ఎంతో ఆర్థిక చేయూత లభిస్తుందని, దీనిని వారు ఉపయోగించుకొని వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదింట అర్హులైన నూతన వధూవరులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక చేయూత అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన నగదును సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు తెలిపారు.కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు విడతలుగా 845 జంటలకు రూ.6.57 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు విద్యపై దృష్టి సారించాలని వారే మన భవిష్యత్తు అన్నారు. మెరుగైన వ్యవస్థ, మెరుగైన సమాజం స్థాపించాలంటే విద్య అనేది ఎంతో అవసరం అని అందుకుగాను ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా నూతన వివాహం చేసుకోవాలనే దంపతులు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.కోడుమూరు శాసనసభ్యులు జె.సుధాకర్ మాట్లాడుతూ పేదింటి తల్లిదండ్రులకు వారి పిల్లల వివాహం పట్ల ఆర్థికంగా భరోసా ఇవ్వడంతో పాటు చేయూత అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా పేదల ఇంట కూడా ఎంతో మంది విద్యావంతులు తయారవుతారని తెలిపారు.నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్య వివాహాలను రూపుమాపేందుకు ఇదొక మంచి ప్రయత్నం అని అందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి చేసే కష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలుస్తూ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు.వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారిణి షేక్ సబిహా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తో సంభాషించి వారి సంతోషాన్ని పంచుకున్నారు.అనంతరం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా 574 మంది లబ్ధి పొందిన వారికి మొత్తం రూ.4.26 కోట్ల రూపాయల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కోడుమూరు శాసనసభ్యులు జె.సుధాకర్, నగర మేయర్ బివై.రామయ్య లబ్ధిదారులకు అందజేశారు.కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, డిఆర్డిఏ పిడి వెంకటసుబ్బయ్య, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస కుమార్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సాయినాథ్, కార్పొరేటర్ పద్మాలత, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author