మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : మోడీ ప్రభుత్వ కార్పోరేట్ విధానాలను వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నరసింహ నాయక్, జిల్లా నాయకులు రణధీర్ లు అన్నారు. శుక్రవారం మండలంలోని కరివేన గ్రామంలో 137వ మే డే వారోత్సవాలలో భాగంగా మండల నాయకులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలన్నారు. నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని కల్పించి, రోజుకు 600 కూలీ చెల్లించాలన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా సాధనకై అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బీజేపీ విధానాలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు మా భాష, సుధాకర్, రాము నాయక్, సురేంద్ర, వెంకటేశ్వర్లు, కరివేన ప్రజలు భూపాల్, సుధాకర్, తిమ్మయ్య, పుల్లయ్య, ఆటో కార్మికులు వెంకటేశ్వర్లు, భాష, మద్దిలేటి పాల్గొన్నారు.