PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా చైర్మన్ సంపత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

1 min read

– అమీన్ భాయ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ‘ జాతీయ ఛైర్మన్, డాక్టర్,సంపత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ, సింగ్ నగర్ లోని కొమటి శేషసాయి సేవ సొసైటీలో, పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేకు కటింగ్స్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని జాతీయ వైస్ చైర్మన్ కృష్ణ కిషోర్ ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ పేద విద్యార్థికి జాతీయ వైస్ ఛైర్మన్ క్రిష్ణ కిషోర్ 3 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగాఅమీన్ భాయ్ మాట్లాడుతూ, నీతి, నిజాయతీ కి మారు పేరు,చట్టం, న్యాయం, ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోరాట యోధుడు,మా చైర్మన్, సంపత్ కుమార్ , ఇంక మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొవలని, మరెన్నో సేవ కార్యక్రమాలు ప్రజలకు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి వెంకటేశ్వరరావు , వాసు , విజయలక్ష్మీ , అజయ్ , మనోహర్ , సాంబశివ , సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

About Author