మానవత్వంతో.. వ్యవహరించండి..
1 min read– నిర్ణీత ధరలకే.. మృతదేహాలను తరలించాలి
– అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులకు సూచించిన ఎస్పీ అన్బురాజన్
పల్లెవెలుగు వెబ్, కడప: కరోన కష్టకాలంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు మానవత్వంతో వ్యవహరించాలని కడప ఎస్పీ అన్బురాజన్ సూచించారు. శనివారం కోడూరు సీఐ విశ్వనాథ రెడ్డి, ఎస్ఐ ఓబన్న ఆధ్వర్యంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతికి వెళ్లే అంబులెన్స్ డ్రైవర్లు నిర్ణీత ధరలకే మృతదేహాలను, కోవిడ్ బాధితులను తరలించాలని ఆదేశించారు. అధిక ధరలకు వసూలు చేయాలని చూస్తే… 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా నిర్ణీత ధరలకే ఫీజు తీసుకుంటామని అంబులెన్స్ డైవర్లు, యజమానులు ఎస్పీ అన్బురాజన్‌కు ఎదుట స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.