బదిలీల కోడ్ తోనే టీచర్ల బదిలీలు నిర్వహించాలి… ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల టీచర్లకు శాశ్వత బదిలీల కోడ్ రూపొందించి బదిలీలు నిర్వహిస్తున్నారని ,ఇటీవల మన ప్రభుత్వం కూడా గత డిసెంబర్ లో జీ వో లు 87 మరియు 90.లను రూపొందించిందని వేల కొద్దీ టీచర్లు హై కోర్టు లో రిట్ పిటిషన్లు వేయడంతో అవి రద్దు చేశారని ఆపస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాల మేరకు శాశ్వత బదిలీల కోడ్ రూపొందించి వెంటనే బదిలీలు నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు నేడు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి వినతి పత్రం ఇచ్చి కోరారు.అలాగే స్పౌజ్, మూచువల్ లేని వారికి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించి న్యాయం చేయాలని, డి ఇ ఓ పూల్ లోని లాంగ్వేజ్ పండిట్ లకు ప్రమోషన్లు ఇవ్వాలని,హై స్కూల్ ప్లస్ లకు స్కూల్ అసిస్టెంట్ లకు ఒక ఇంక్రిమెంట్ తో ప్రమోషన్స్ కాకుండా జె యల్ స్థాయి లో రెండు ఇంక్రిమెంట్ లతో ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు.టీచర్ అటెండెన్స్ యాప్ లో అన్ని రకాల సెలవులను అప్డేట్ చేసే అవకాశం ఆయా డిడిఓ లకు ఇవ్వాలని కోరారు. రాబోవు సంవత్సరంలో యాప్లను తగ్గించడాన్ని స్వాగతించారు.