చిరుధాన్యాల సాగు పై అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలపై శుక్రవారం నాడు పెసరవాయి దుర్వేసి గ్రామాలలో గ్రామ వ్యవసాయ సలహామండలి సమావేశంలో నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించారు చిరుధాన్యాలపై అవగాహన చిరుధాన్యాలైనటువంటి జొన్న, రాగులు, కొర్రలు, సజ్జలు, సామలు, ఆర్కేలు వీటి ప్రాముఖ్యతను రైతులకు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్‌రెడ్డి తెలియజేశారు ఆరోగ్యపరమైన విలువలను వివరించారు. పీచు పదార్థము ,మాంసపుకృతులు, ఖనిజాలు ,ఇనుము ,సున్నము అధిక మోతాదులో ఉంటుంది కనుక ఆరోగ్యకరమైన సమస్యలు ఎటువంటివి రాకుండా వీలుంటుంది . మన దిన ఆహారంలోల ఖచ్చితంగా చిరుధాన్యాలు ఒక పూట ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా తెలిపారు చిరుధాన్యాల విస్తీర్ణాన్ని సాగును పెంచవలసిందిగా రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు సోదరులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.