దివంగత మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి 31వ వర్థంతి
1 min read– తన తండ్రి దివంగత రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి హయాంలోనే రాయచోటి అభివృద్ధి
– రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: తన తండ్రి దివంగత రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి హయాంలోనే రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని ఆయన తనయుడు, తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(రాముడు) పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలోని మండిపల్లి భవన్ లో దివంగత రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి 31వ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగిరెడ్డి చిత్రపటానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయన తనయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సంధర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గానికి తన తండ్రి నాగిరెడ్డి చేసిన సేవలు నేటికి మరవవు అని అన్నారు. 1985, 1989 లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి రాయచోటి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్, డిపో, నేతాజీ క్లబ్, చెక్ పోస్ట్ వద్ద వాటర్ ట్యాంక్ వంటివి నిర్మించడమే కాకుండా కొత్తగా అప్పుడే వచ్చిన ఆర్టీసీ బస్సులను సైతం మారుమూల గ్రామాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం, గ్రామాల్లో విద్యుత్తీకరణ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి అంటే ఏంటో రాయచోటి నియోజకవర్గ ప్రజలకు చేసి చూపించిన గొప్ప మహోన్నత వ్యక్తి మండిపల్లి నాగిరెడ్డి అన్నారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన చేసిన అభివృధ్ధి ఎన్నటికీ మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, హరి, విష్ణువర్ధన్ రెడ్డి. బిందు రెడ్డి, కొండారెడ్డి మదన అభినయ్, నాగార్జున రెడ్డి మధు. శివారెడ్డి ఆనంద్ మీసాల వెంకటరమణ, కేతరి వెంకటరమణ, నంద, భూపేష్, జయరాము, వెంకట్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.